Eluru: సార్.. అమ్మ చొక్కా కొనివ్వ‌లే..కేసు పెట్టేయండి!

Eluru: పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే.. ఏదొక సాక్షం ఉండాలి. ఆధారాలు ఇవ్వకపోతే.. వారు కేసు నమోదు చేయరు. దీంతో బాధితులకు న్యాయం జరగదు. ఈ విషయాన్ని బహుశా టీవీల్లో చూసి తెలుసుకున్నాడామో ఓ పదేళ్ల బుడ్డోడు. ఈ క్రమంలో అదే బుడ్డోడికి అమ్మ రూపంలో సమస్య వచ్చిపడింది. స్నేహితుడి బర్త్‌డేకి తెల్లచొక్కా వేసుకుని పార్టీకి వెళ్దమనుకోగా.. అందుకు తల్లి అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక.. స్నానం చేసి… దుస్తులు కూడా వేసుకోకుండా.. టవల్‌తో వెళ్లి పోలీసులకు బాలుడు ఫిర్యాదు చేసిన సంఘటన వైరల్‌గా మారింది. ఇంత చిన్న వయసులో ఇలా ఫిర్యాదు చేయడానికి రావడం ఏంటని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

ఈ సంఘటన ఏపీలోని(andhra pradesh) ఏలూరు(eluru) జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు మదనపడ్డాడు. స్నానం చేసి కట్టుకున్న టవల్తోనే చొక్కా లేకుండా నేరుగా పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇక ఆ బాలుడి పేరు.. సాయిదినేష్, ఏలూరు కొత్తపేటలో నివాసం ఉంటున్నారు. ఇతని తల్లి రెండేళ్ల కిందట చనిపోయారు. అనంతరం తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈక్రమంలో అతని కుమారుడు… మారు తల్లి(పిన్ని)పై తెల్లచొక్క ఇవ్వలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం విశేషం.