పిట్టను తీసి కుక్కను పెట్టాడు: ఎలాన్ మస్క్ ఐడియా
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ట్విట్టర్ ఖతాకు ఉండే లోగో బ్లూబర్డ్ ని మార్చి దాని స్థానంలో డోజి మీమె లోగోని ఎలన్ మస్క్ మార్పు చేశారు. గతంలో బ్లూబర్డ్ అంటే పక్షి బొమ్మ ట్విట్టర్‌కు ఉండేది. అయితే ప్రస్తుతం డోజి మీమె అంటే.. కుక్క బొమ్మను ట్విట్టరు లోగోగా మార్పు చేశారు. మార్చిన లోగోను చూసి యూజర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు ఉన్న ట్విట్టర్ పిట్ట స్థానంలో కుక్క (డోజీ) కనిపిస్తోంది. అయితే ఇది డెస్క్‌టాప్ వర్షన్లో ఉండే వారికి కుక్క బొమ్మ కనిపిస్తుందని… మొబల్ ఫోన్ వాడే వారికి ఎప్పటిలాగే బ్లూబర్డ్ ఉంటుందని మస్క్ చెబుతున్నారు. అయితే ఇది కూడా మారుస్తారా లేదా అన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. క్రిప్టో కరెన్సీలోగో కూడా డోజీ కావడంతో.. నిన్న ఒక్కసారిగా క్రిఫ్టో కరెన్సీ షేర్స్ అమాంతం పెరిగిపోయాయి. అయితే తొలి నుంచి క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇచ్చే మస్క్… తాజాగా తన కంపెనీ లోగోను డోజీ బొమ్మ పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ అమాంతం పెరిగిపోయింది. దీని విలువ ఏకంగా 22 శాతం పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.