Aluminium Foil ఎలా వాడాలో తెలుసా!
Hyderabad: హోటళ్ల(Hotels)లో, ప్రయాణాల్లో ఆహారాన్ని ఎక్కువసేపు వేడి(Heat)గా ఉంచేందుకు అల్యూమినియం ఫాయిల్(Aluminium foil)ని వాడుతుంటారు చాలామంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో దీని వినియోగం మరీ ఎక్కువ. పార్సిల్ చేసిన ఆహారం వేడిగా ఉండేందుకు చాలా హోటళ్లు అల్యూమినియం ఫాయిల్‌ను వాడుతుంటాయి. అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన ఆహారం చాలా సమయం వరకు వేడిగా ఉండటమే కాకుండా తాజాగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది దీనికే మొగ్గు చూపుతారు. కానీ దీనిని వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఆహారంతోపాటు మన శరీరంలోకి వెళ్లే అల్యూమినియం కణాలు మన ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయకుండా విసర్జింపబడతాయి. కానీ అల్యూమినియం ఫాయిల్‌ను సరైన పద్దతిలో వాడటం మంచిదంటున్నారు నిపుణులు.
వండిన ఆహారం ఎక్కవ సమయం వేడిగా ఉండేందుకు పాత్రపైన మూతలా ఫాయిల్‌ని ఉపయోగించవచ్చు. ఇది తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది మరియు ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా మరియు వేడిగా ఉంచుతుంది. కానీ దీనిలో ఆహారాన్ని వేడిచేయకూడదు. దీంట్లో ఆహారం వేడి చేస్తే అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయి.
టమాటలు, నిమ్మ, నారింజ వంటి ఆమ్ల గుణాలను కలిగిన వాటిని నిల్వ చేయడానికి, వండటానికి ఫాయిల్‌ని వినియోగించడం మంచిది కాదు. ఇది అల్యూమినియంతో చర్యనొంది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది.
బేకింగ్ చేసేటప్పుడు చాలా మంది తరచుగా అల్యూమినియం ఫాయిల్‌ను పార్చ్‌మెంట్ కాగితానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. అల్యూమినియం ఉష్ణ వాహకం. అందువల్ల ఇది ఎక్కువ వేడిని గ్రహించడం వల్ల పదార్థాలు మాడిపోతాయి.
అల్యూమినియం ఫాయిల్ తేమను లాక్ చేయడానికి చాలా బాగుంటుంది. త్వరగా పాడిపోని పదార్థాలను నిల్వ ఉంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. పొడి పదార్థాలను నిల్వ చేయడం వల్ల అవి తాజాగా ఉండే కాలం పెరుగుతుంది.