పోర్న్ స్టార్ దెబ్బ‌కి.. దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్య‌క్షుడు

donald trump is the first us president convicted in a crime

Donald Trump: అమెరికా చ‌రిత్ర‌లోనే తొలిసారి ఆ దేశానికి అధ్యక్షుడిగా ప‌నిచేసిన వ్య‌క్తి ఓ కేసులో నిందితుడిగా తేలాడు. అగ్ర రాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పోర్న్ స్టార్ స్టార్మీ డ్యానియ‌ల్స్ ఇచ్చిన వాంగ్మూలం ప్ర‌కారం జ‌రిగిన విచార‌ణ‌లో నిందితుడిగా తేలాడు.

డొనాల్డ్ ట్రంప్ ప్ర‌ముఖ పోర్న్ స్టార్ స్టార్మీ డ్యానియ‌ల్స్‌కు డ‌బ్బు చెల్లించి ఆ విష‌యాన్ని 2019 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో చూపించ‌లేద‌ని కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ న్యూయార్క్‌ కోర్టులో వ్యాఖ్య‌లు చేయ‌డం షాకింగ్ అంశంగా మారింది. డ్యానియ‌ల్స్‌తో ట్రంప్ ఎఫైర్ పెట్టుకుని ఈ విష‌యం బ‌య‌టకు పొక్క‌కుండా 130,000 డాల‌ర్లు చెల్లించాడ‌ట‌.

2016 ఎన్నిక‌ల‌కు ముందు ఆమెకు డ‌బ్బు చెల్లించిన అంశాన్ని దాచి పెట్టి ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్ల‌ఘించార‌ని న్యూయార్క్ కోర్టులో ప్రాసిక్యూట‌ర్ వాద‌న‌లు వినిపించారు. మ‌రో వైపు డ‌బ్బు చెల్లించిన మాట నిజ‌మే కానీ ట్రంప్ ప‌రువును కాపాడుకునేందుకే చెల్లించార‌ని ట్రంప్ త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు. వాదోప‌వాదాలు విన్న న్యూయార్క్ కోర్టు ట్రంప్‌ను దోషిగా ప్ర‌క‌టించింది. మ‌రి ఇప్పుడు ట్రంప్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎంటా అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.