Curd: పెరుగుతో ఇవి డేంజ‌ర‌స్ కాంబినేష‌న్

Hyderabad: పెరుగు(Curd) మంచి పోషకాహారం. పెరుగులో శరీరానికి కావాల్సిన చాలా ఖనిజలవణాలు(Minerals) పుష్కలంగా ఉంటాయి. పెరుగును చిన్నపిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తింటారు. కొందరైతే పెరుగన్నం తినకుండా భోజనం ముగించరు. అయితే పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తినడం, కొన్ని ఆహార పదార్థాలు తిన్న వెంటనే తినడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆ పదార్థాలేంటో చూద్దాం..

చేపలతో చేసిన ఏ వంటకాలతోనూ పెరుగు కలిపి తినకూడదు. చాలామంది వేయించిన చేప ముక్కలను పెరుగుతో నంజుకుని తింటారు. ఇలా తినడం అంత మంచిది కాదు. జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి.

నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీలు వంటి ఫ్రైడ్​ ఐటమ్స్​తోనూ పెరుగు తీసుకోకూడదు. నూనె, పెరుగు కలిపి తినడం వల్ల సజావుగా జీర్ణం కాదు.

పెరుగులో ఉల్లిపాయ తినడం చాలామందికి అలవాటు. అంతేకాదు, పెరుగు, ఉల్లిపాయ కలిపి రైతా కూడా చేసుకుంటారు. కానీ ఈ రెండింటినీ కలిపి తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

పెరుగన్నంలో మామిడి పండు తినడం చాలామందికి అలవాటు. అయితే ఇలా తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి.

పాలతోనూ పెరుగు కలపకూడదు. అంతేకాదు టీ, కాఫీలు తాగిన వెంటనే పెరుగు తినడం కూడా అంత మంచిది కాదు. మజ్జిగన్నం, మజ్జిగ వంటివి ఒంటికి చలువ చేస్తాయి. వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్​ బారిన పడే అవకాశం తగ్గుతుంది.