DK Shivakumar: వీలైతే CMని చేయండి.. లేదా ఎమ్మెల్యేగా ఉంటా
Bengaluru: వీలైతే సీఎంని చేయండి.. లేదా ఎమ్మెల్యేగానే ఉంటానని అంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(dk shivakumar). కర్ణాటక ఎన్నికల్లో(karnataka elections) భారీ విజయాన్ని దక్కించుకున్న కాంగ్రెస్.. ఎవర్ని సీఎంగా నియమించాలా అని తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఉన్నారు. అయితే.. సిద్ధరామయ్యే మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు ఉండగా.. ఈ నేపథ్యంలో మంగళవారం శివకుమార్.. సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను కలిసారు. ఆయనతో చర్చిస్తూ.. “వీలైతే నన్ను సీఎంను చేయండి.. లేదా నేను ఎమ్మెల్యేగానే కొనసాగుతా” అన్నారట.
2019లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలాక.. మళ్లీ పుంజుకునేందుకు ఎంతో కృషిచేసానని శివకుమార్ తెలిపారు. గతంలో సిద్ధరామయ్య సీఎంగా చేసారు కాబట్టి ఈసారి తనను సీఎంని చేస్తే బాగుంటుందని ఖర్గేతో అన్నారట. సిద్ధరామయ్యను సీఎంని చేయడం లింగాయత్‌లకు కూడా ఇష్టంలేదని శివకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో చర్చించాక సీఎంని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సోనియా షిమ్లాలో ఉన్నారు.