IPL 2025: 50 కోట్లు ఇస్తాం.. మాకు హిట్ మ్యాన్ కావాలి
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం ఇప్పటి నుంచే వేలాలు మొదలు కానున్నాయి. ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌లో కేవలం ఆటగాడిగా మాత్రమే ఉన్న రోహిత్ శర్మ 2025 నాటికి ముంబైని వదిలేస్తాడనే ప్రచారం ఎప్పటి నుంచో జోరుగా సాగుతోంది. 2025 ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దాంతో రోహిత్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నౌ సూపర్ జైంట్స్ పోటీ పడుతున్నాయి. దాదాపు రూ.50 కోట్ల మేర ఇచ్చి మరీ రోహిత్‌ను తీసుకోవాలని చూస్తున్నాయట. ప్రస్తుతం విరామంలో ఉన్న రోహిత్ శర్మ సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న బంగ్లాదేశ్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడనున్నాడు.