Dasara: 100 కోట్ల క్లబ్​లో నేచురల్​ స్టార్​ నాని!

నేచురల్​ స్టార్​ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ సినిమా శ్రీరామ నవమి సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సాఫ్ట్​ క్యారెక్టర్లతో అలరించే నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, కథ, కథనం, నేపథ్యం, టేకింగ్​.. అన్నీ సినిమా విజయానికి దోహదపడ్డాయి. ఇక కలెక్షన్స్ లో కూడా దసరా సినిమా దూసుకుపోతుంది. అనుకున్నట్టే నాని దసరా సినిమా కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. మార్చ్ 30న ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఏప్రిల్ 5 నాటికి దసరా సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ విషయాన్ని ప్రభాస్​ తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ఈ సినిమా మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా సాధించి నాని కెరీర్ లో అత్యంత వేగంగా 50 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో నాని కచ్చితంగా 100 కోట్లు చాలా ఫాస్ట్ గా సాధిస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే నాని వంద కోట్ల క్లబ్​లో చేరిపోయాడు. దీంతో నాని కెరీర్ లో దసరా రెండో 100 కోట్ల సినిమాగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా 125 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈగ సినిమాలో నాని పాత్రకు హీరో ప్రాధాన్యం లేకపోవడంతో అది నాని ఖాతాలో తీసుకోలేదు ప్రేక్షకులు. ఇప్పుడు రాజమౌళి బ్రాండ్ లేకుండా నాని ఓ కొత్త డైరెక్టర్ తో 100 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించడంతో నాని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. దీనిపై నాని, చిత్రయూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా గ్రాండ్ గా బుధవారం నాడు కరీంనగర్ లో నిర్వహించారు. అటు అమెరికాలో కూడా 2 మిలియన్ డాలర్స్ సాధించి నాని కెరీర్ లో అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ సాధించిన మొదటి సినిమాగా నిలిచింది దసరా.

ఓవర్సీస్‌లో నానికి మంచి పట్టున్న యూఎస్‌లో దసరా సినిమాకు ప్రేక్షకలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అక్కడ 1.7 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రావడంతో ఈ సినిమా నాని కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నాని కెరీర్‌లో తొలిసారి 2 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటర్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్​, మహేష్​, సుకుమార్​, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా MCA ఉండేది. దసరా రాకతో ఈ సినిమా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమా(MCA) ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్ల షేర్ రాబట్టింది. మూడో స్థానంలో రూ.35 కోట్ల షేర్ తో ‘నేను లోకల్’ , ఆ తర్వాత రూ. 32.03 కోట్లతో ‘జెర్సీ’, రూ. 28.56 కోట్లతో ‘నిన్ను కోరి’ టాప్ 5లో నిలిచాయి. దసరా సినిమా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకెళ్తుండటంతో, టోటల్ రన్‌లో ఈ మూవీ ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.