Naga Chaitanya: మిలియన్ల వ్యూస్​తో దూసుకుపోతున్న ‘కస్టడీ’ టీజర్!

అక్కినేని హీరో నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్​ ప్రభు కాంబినేషన్లో రాబోతున్న సినిమా కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న కస్టడీ సినిమాలో నాగ చైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా టీజర్​ని ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళుతుంది’ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన’ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది . అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు’, ‘నిజం ఒక ధైర్యం.. నిజం ఒక సైన్యం.. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది’ అంటూ 20 సెకండ్ల నిడివిగల టీజర్​లో చై చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసిన టీజర్ రికార్డు వ్యూస్​తో దూసుకుపోతోంది. ఈ రెండు భాషల్లో కలుపుకుని, 15 మిలియన్ ప్లస్ వ్యూస్ లభించాయి. ఇంకా ఫాస్టుగా ఈ నెంబర్స్ మారుతూనే ఉన్నాయి. కృతి శెట్టి కథానానాయికగా నటించిన ఈ సినిమాలో, అరవిందస్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో జోరు పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే కస్టడీ సినిమా టీజర్‌‌ను రిలీజ్ చేసింది. పోస్టర్స్ రిలీజ్ దగ్గర నుంచే కస్టడీ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా టీజర్‌‌ను కట్ చేశారు దర్శకుడు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బంగార్రాజు’ సినిమా తరువాత కృతి శెట్టి, నాగచైతన్య మరోసారి కలిసి నటించారు. ఇళయరాజా, ఆయన కొడుకు యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి కీలకపాత్రలు పోషించారు.
థాంక్యూ సినిమా తర్వాత నాగచైతన్య నటిస్తున్న సినిమా కస్టడీ. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డాలో కూడా చై.. కీలకపాత్ర పోషించాడు. ఆ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. దాంతో ఈ సినిమా హిట్‌పైనే నాగచైతన్య ఆశలు పెట్టుకున్నారు. సమ్మర్​ కానుకగా ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.