Covid alert: 24 గంటల్లో పది వేలు దాటిన కేసులు
Delhi: దేశంలో కరోనా(covid) వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 10 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,158 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్నటితో పోలిస్తే 30శాతం అధికంగా నమోదయ్యాయి. ఇక కోవిడ్(covid) చికిత్స పొందుతున్న వారిలో సుమారు 19 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడు నెలల్లో(230 రోజులు) ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వివరాల ప్రకారం కేసుల నమోదు ఈ విధంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,42,10,127కు చేరింది. ప్రస్తుతం 44,998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివ్ రేటు 4.42శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.71శాతం.. మరణాల రేటు 1.19%గా ఉంది. భారత్‌లో సగటున గత వారంలో రోజుకు 5,555 కోవిడ్ కేసులు నమోదవ్వగా అంతకు ముందు వారం 3,108 వెలుగు చూశాయి.