covid:వరుసగా నాలుగో రోజూ పది వేల కేసులు
Delhi: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల(covid cases) విజృంభన కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజులుగా కేసుల సంఖ్య పదివేలకు పైగా నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తక్కువే. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల(Active cases) సంఖ్య 57,542కు చేరుకుంది. మరోవైపు కొవిడ్(covid deaths)తో 19 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.68 శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 0.13 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని తెలిపాయి. రానున్న పది రోజుల్లో ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.