‘భయాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యమే సరైన మార్గం’

కెరీర్​ ప్రారంభం నుంచీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది కన్నడ భామ శ్రీలీల. మొదటి సినిమా పెళ్లిసందDతో తెలుగు వారిని మాయచేసిన ఈ భామ యంగ్​ హీరోలతోపాటు సీనియర్​ హీరోలతోనూ జతకట్టి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటుంది. తాజాగా మాస్​మహారాజ రవితేజ హీరోగా వచ్చిన ‘ధమాకా’తో బ్లాక్​బస్టర్​ హిట్​ని ఖాతాలో వేసుకున్న శ్రీలీల మంచి ఫామ్​లో ఉంది. ఇక, సినిమాలతోపాటు సోషల్​ మీడియాలోనూ యాక్టివ్​గా ఉండే శ్రీలీల చేసిన ఓ పోస్ట్​ నెట్టింట వైరల్​గా మారింది. సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్​ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంది శ్రీలీల. ఇక, తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో శ్రీలీల చేసిన ఒక పోస్ట్​ అందరినీ ఆకర్షిస్తోంది. భయాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగాలనీ, భయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యమే సరైనది (Face your fears. Because, Fear is a reaction and Courage is decision) అంటూ పోస్ట్​ చేసింది శ్రీలీల. స్ఫూర్తి నింపే ఇలాంటి మాటలు చాలామందిలో ధైర్యాన్ని నింపుతాయంటూ చాలామంది కామెంట్స్​ చేస్తున్నారు.

నటసింహం నందమూరి బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో శ్రీలీల కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల‌ బాక్స‌ర్ పాత్ర చేస్తోన్న‌ట్లు స‌మాచారం. అందుకోసం బాక్సింగ్ కూడా నేర్చుకుంటోన్న‌ట్లు తెలిసింది. బాలకృష్ణ కూతురిగా అల్ల‌రి మ‌న‌స్త‌త్వంతో పాటు ఆత్మ‌స్థైర్యం క‌ల‌బోసిన డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో శ్రీలీల క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో గ‌త వార‌మే జాయినైంది శ్రీలీల‌. ఈ సినిమా కోసం ఆమె ముప్పై రోజుల పాటు డేట్స్ కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. ఎన్‌బీకే 108 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ‌ర‌త్‌కుమార్‌, అర్జున్ రాంపాల్ కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబినేష్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు వైష్ణ‌వ్‌తేజ్‌, నితిన్‌, న‌వీన్ పొలిశెట్టిల‌తో సినిమాలు చేస్తోంది శ్రీలీల‌. పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, సాయి ధరమ్​ తేజ్​ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న ‘వినోదయా సిత్తం’ రీమేక్​లోనూ ఓ పాటలో ఆడిపాడనుంది ఈ కన్నడ బ్యూటీ.