గోమూత్రంతో కర్నాటక అసెంబ్లీ శుద్ది.. బీజేపీకి మండుతోంది!

bengaluru: కర్నాటక అసెంబ్లీ(karnataka assemble) లో ఇవాళ నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే(congress mlas)లు తొలిరోజే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత.. గోమూత్రం అసెంబ్లీలో చల్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(deputy cm dk sivakumar) నాయకత్వం వహించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. గత బీజేపీ(bjp) పాలనలో ప్రతి పనికి 40 శాతం కమిషన్‌ వసూలు చేసేవారని… ఆ అవినీతి పాపాన్ని తూడిచి వేయాలని గోమూత్రం వినియోగించినట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. బీజేపీ భాషలోనే కాంగ్రెస్‌ బుద్ది చెప్పిందని అనుకోవచ్చు. వాస్తవానికి హిందుత్వం పేటెంట్‌ను బీజేపీ బలంగా వాడుకుంటుంది. హిందుత్వంతోనే కర్నాటకలో ఈ సారి కూడా గెలుపొందాలని చూసింది. అయితే అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ దేశ సాంప్రదాయ, సంస్కృతిలో భాగంగా బీజేపీ నోరు మూయించే ప్రయత్నాలు ముందునుంచే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

గోమూత్రం చల్లడం, బీజేపీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నుంచి కౌంటర్‌ ఎవరూ ఇవ్వలేదు. అయితే.. కాంగ్రెస్‌ మాత్రం పక్కా ప్లాన్‌ ప్రకారం గోమూత్రం అసెంబ్లీలో చల్లింది. అయితే.. దీనిపై బీజేపీ నాయకులకు కూడా ఏవిధంగా స్పందించాలో తెలియని పరిస్థితి. కాంగ్రెస్‌ స్పీడ్‌ చూస్తుంటే వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి హిందుత్వం నినాదం తమదేనని నిరూపించుకుని.. బీజేపీని రాష్ట్రం నుంచి తరమివేయాలని ఆలోచనగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.