కండోమ్‌లు ఎక్కువగా వాడేది ఏపీలోనే
Condom: ప్రస్తుతం భారత్‌లో అసురక్షితమైన శృంగారం అనే ట్రెండ్ నడుస్తోంది. అంటే కండోమ్‌లు లేకుండానే కానిచ్చేస్తున్నారు. మరోపక్క వైద్య నిపుణులు కండోమ్‌లు వాడండి సురక్షితమైన లైంగిక చర్యల్లో పాల్గొనండి అని ఎంత మొత్తుకున్నా వినడంలేదు. ఇటీవల చేసిన ఓ సర్వేల్లో ఏ రాష్ట్రాల్లో ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. ఎక్కడ తక్కువ వాడుతున్నారో డేటా బయటికి వచ్చింది.
ఆ డేటా ప్రకారం.. కండోమ్‌లు అత్యధికంగా వాడే ప్రాంతాల్లో దాదర్ అండ్ నగర్ హవేలీ అనే కేంద్ర పరిపాలిత రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రతి 10 వేల మందిలో 993 మంది కండోమ్‌లు వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల మందిలో 973 మంది వాడుతున్నారు. ఇక తక్కువగా వాడుతున్న రాష్ట్రం కర్ణాటకలో ఉంది. ప్రతి 10 వేల మందిలో కేవలం 307 మందే వాడుతున్నారు. కర్ణాటకలో 6 శాతం మందికి అసలు కండోమ్‌లు ఎలా వాడాలో కూడా తెలీదట. పుదుచ్చేరి, గుజరాత్, పంజాబ్, చండీగడ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కండోమ్‌లను వాడే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.