KCR: ఢిల్లీకి సీఎం పయనం.. నేడే కార్యాలయం ప్రారంభం!
hyderabad: తెలంగాణ సీఎం కేసీఆర్(cm kcr) ఇవాళ ఢిల్లీ(delhi tour)కి బయలుదేరారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టు(begumpet airport)కు చేరుకున్న ఆయన.. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలోని వసంత విహార్(vasant vihar)లో బీఆర్‌ఎస్ సెంట్రల్ ఆఫీసు(brs central office)ను గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ఆయన ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.
ఇప్పటికే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన వేడుకల ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌దగ్గరుండి పర్యవేక్షించారు. 2021, సెప్టెంబర్ 2న ఆఫీసు నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 11వేల చదరపు అడుగుల స్థలంలో బిల్డింగ్ నిర్మించారు. జీ ప్లస్3 ఫ్లోర్లు కలిగిన ఈ బిల్డింగ్‌లో మొత్తం 20 గదులు ఉంటాయి. అంతేకాకుండా, స్పెషల్‌గా రెండు సూట్ రూంలు కూడా నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్లో కేసీఆర్ ఆఫీస్, ఆయనకు స్పెషల్ సూట్ రూం కేటాయించారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మరో సూట్ రూంను ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ కోసం.. దాదాపు రూ.8.64 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.