Jagan స్టిక్కర్‌ చించిన కుక్క ఎంత డేంజరో తెలుసా?

vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ కుక్క సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్టిక్కర్‌ను చించి వార్తల్లో నిలిచింది. అయితే.. సాధారణంగా ఏ కుక్కలైనా అలా చేస్తాయా.. అసలు చేయగలవా అని సామాన్యలకు ఎన్నో రకాల సందేహాలు కలుగుతుంటాయి. అలా జగన్‌ స్టిక్కర్‌ పీకించడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా వైసీపీ నాయకులు దృష్టి సారించారు. అవన్నీ ప్రస్తుతానికి తెలియలేదు కానీ.. ఆ కుక్క పేరు అంటే అది ఏ జాతికి సంబంధించిందో మాత్రం బయటకు వచ్చింది. ఇందులోనే చాలా ఆసక్తికర విషయం ఉంది. ఈ జాతి రకం కుక్కలు.. మామూలు రకమైనవి కాదండోయ్‌.. ఇవి యజమాని ఏది చెబితే అది చేస్తాయంట.

ఏపీలో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే స్టిక్కర్లను ఆ పార్టీ నాయకులు గోడలకు అంటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ కుక్క గోడకు అంటించిన స్టిక్కర్‌ పీకడం సంచలనంగా మారింది. ప్రజలకే కాదు.. కుక్కలకు కూడా జగన్‌ అంటే నచ్చట్లేదు అని TDP పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. స్టిక్కర్‌ చించిన కుక్క వీడియో వైరల్‌ కావడంతో పలువురు ఆ కుక్కపై, యజమానిపై ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంచితే.. స్టిక్కర్‌ను చించిన కుక్క పేరు బెల్జియం మాలినోస్‌ అంట. ఈ జాతి కుక్కలకు ఏన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నారు. దీనికి యజమాని ఏ పని అప్పగిస్తే.. అది తూచా తప్పకుండా పాటిస్తుందట. యజమాని ఒక్క కమాండ్‌ ఇస్తే చాలు ఏదైనా చేస్తుందని అంటున్నారు. ఇది వాసనను కూడా బాగా పసిగడుతుందట. యజమాని ఏది తీసుకురమ్మంటే దాన్ని చీల్చి పట్టుకుని వస్తుందట. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత స్టిక్కర్‌ను కుక్క ఎందుకు చించిందో మీకు అర్థమై ఉంటుంది కదా.. ఇదండీ జగన్‌(jagan) స్టిక్కర్‌ కుక్క చింపివేయడం వెనుక ఉన్న కథ.