Chandrababu: వాహనంపైకి రాళ్లు రువ్విన అల్లరిమూకలు..
yerragondapalem: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం(yerragondapalem)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(tdp chief chandrababu) చేపట్టిన యాత్ర తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ(ycp) కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని.. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రాని(idhem kharma mana rastraniki)కి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం యర్నగొండపాలెంలో పర్యటించారు. ఈక్రమంలో ఆయన వచ్చే మార్గంలో ప్లకార్డులు, నల్లజెండాలతో రోడ్లపైకి వచ్చి పలువురు నిరసన తెలిపారు. ఎస్సీలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వైకాపా కార్యకర్తల నిరసనలతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు. మరోవైపు స్థానిక తెదేపా శ్రేణులు సైతం భారీగా మోహరించాయి. ఓ దశలో ఇరు వర్గాలు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం ముగియగా.. చంద్రబాబు పర్యటిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్తు సైతం నిలిపివేయడం వైసీపీ నాయకుల పనేనని టీడీపీ ఆరోపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్ డైరెక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని వారు మండిపడ్డారు.
ఇక యర్రగొండపాలెంలో చంద్రబాబు సెక్యూరిటీ లోని NSG కమాన్డెంట్ సంతోష్ కుమార్ తలకు గాయం అయ్యింది. వైసీపీ నిరసనల సమయంలో కాన్వాయ్ పైకి పలువురు రాళ్లు రువ్వగా… అవి చంద్రబాబుకు రక్షణగా నిలిచిన NSG కమాండోస్ కి తగిలాయి. వెంటనే సంతోష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అతనికి మూడు కుట్లు వేసి కట్టు కట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. NSG బృందం అడ్డుగా లేకపోతే చంద్రబాబుపై రాళ్ళు పడేవని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.