Chandrababu Naidu: తెలంగాణ TDP వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బ్రాహ్మణి

chandrababu naidu says tdp will come into power in telangana too

Chandrababu Naidu: భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లోనూ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఈరోజు హైద‌రాబాద్ చేరుకుని TTDP ముఖ్యనాయకులతో చంద్ర‌బాబు సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌భ్యుల‌తో మాట్లాడుతూ.. ప్రతి నెల రెండవ శనివారం,ఆదివారం తెలంగాణకు వ‌స్తాన‌ని అన్నారు. పార్టీ నిర్మాణం పైనే దృష్టి పెట్టాల‌ని త్వరలో గ్రామస్తాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకురావాల‌ని పిలుపునిచ్చారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. యువకులకు, బీసీలకు పెద్దపీట వేయ‌బోతున్నామ‌ని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యమ‌ని దిశానిర్దేశం చేసారు. అభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే TTDP అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ tdp బాధ్యతలు నారా లోకేశ్‌కి అప్పగించే అవకాశం ఉందా? నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా?’ అని రిపోర్టర్లు అడిగారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇస్తూ… “” మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి.. కానీ మీ అంత ఫాస్ట్ గా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను “” అని స్పష్టం చేశారు.