minister jogi ramesh: చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం
vijayawada: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(tdp chief chandrababu naidu) త్వరలో జైలుకు వెళ్లబోతున్నాడంటూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్(minister jogi ramesh)సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిపై విచారణకు సుప్రీం కోర్టు(supreme court) ఆదేశించిందన్నారు. రాజధాని అమరావతి(capital amaravathi) భూములను తన బంధువర్గానికి ఏ విధంగా దోచి పెట్టాడో అవన్నీ బయటికి వస్తాయన్నారు. త్వరలో బాబు జైలుకు వెళ్లడం కూడా ఖాయమన్నారు. బంటుమిల్లి మండలం బండ్లగూడెం గ్రామ పర్యటనలో జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని కీలక విధాన నిర్ణయాలు, భూ కుంభకోణంతో సహా పలు భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరగగా.. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృథా, దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సిట్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. ఈక్రమంలో చంద్రబాబు త్వరలో అరెస్టు అవుతారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే.. ఇది మాత్రం సీఎం జగన్‌కు లీగల్ విక్టరీగా చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా.. తాజాగా.. సుప్రీ కోర్టు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.