‘దసరా’కి సెన్సార్​ షాక్

నేచురల్​ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా. పాన్​ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్​ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమా తాజాగా సెన్సార్​ పూర్తి చేసుకుంది. కానీ ట్విస్ట్​ ఏంటంటే.. టీజర్​, ట్రైలర్​లో నాని మాస్​ యాక్షన్​తోపాటు మసాలా దట్టించిన డైలాగ్​లు కూడా వినిపించడంతో సెన్సార్​ సభ్యులు ఈ సినిమాకి చాలా కోతలు పెట్టారట. సినిమాలోని బూతు పదాలతో పాటు వైలెంట్ సన్నివేశాల్లో భారీగా కోత పెట్టారని తెలుస్తోంది. దసరా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు ఏకంగా 36 కట్స్ చెప్పారట. దసరా మూవీ నేపథ్యం, క్యారక్టరైజేషన్స్ రీత్యా బూతు పదాలు వాడారు. తెలంగాణ మాండలికంలో కొంచెం అభ్యంతరకర పదాలు డైలాగ్స్ గా పెట్టారు. హీరో నాని ధరణి అనే బొగ్గు కార్మికుడు పాత్ర చేశాడు. మొరటు విలేజ్ కుర్రాడి పాత్ర కావడంతో నాని డైలాగ్స్ కాస్త ఘాటుగా ఉన్నాయి.

అయితే దసరా టీమ్ U/A కావాలని అడగగా… అది ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో కట్స్ చెప్పారట. డైలాగ్స్ లో ఉన్న బూతు పదాలు మ్యూట్ చేయాలన్నారట సెన్సార్​ సభ్యులు. మొత్తంగా 36 కట్స్ చెప్పినట్లు సమాచారం. లేని పక్షంలో దసరాకు ‘A’ సర్టిఫికెట్ ఇస్తామని హెచ్చరించారట. దీంతో సెన్సార్ సభ్యుల సూచనలు అంగీకరిస్తూ దసరా మూవీలో కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయడంతో పాటు, సన్నివేశాలు తొలగించనుంది చిత్రయూనిట్​. కాగా, లెక్కకు మించిన కట్స్ నేపథ్యంలో మూవీ ఫీల్ మిస్సవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ మూవీలో నాని పలికిన కొన్ని పదాల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. హీరో ‘బాన్**’ వంటి బూతు పదం ఎలా చెప్తారని ప్రెస్ మీట్లో నానిని అడగడంతో ఆయన సమర్ధించుకున్నారు. ఇది వాడుకలో ఉన్న పదమే. దానర్థం బూతు కాదు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించే క్రమంలో వాడతారని నాని వివరణ ఇచ్చారు. కాగా, ఇప్పటివరకు సెన్సార్​ బోర్డు వద్ద అధిక సంఖ్యలో కట్​లకు గురైన మొదటి సినిమా దసరానే.
ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘దసరా’.దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో, పాపులర్ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

ఈ సినిమా మార్చి 30న దసరా వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర విజయం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాని విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా విజయంపై నాని కాన్పిడెంట్​గా కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమాపై అభిమానులతోపాటు పరిశ్రమలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.