TDP మేనిఫెస్టోలో మహిళలకు వరాల జల్లు.. దద్దరిల్లిన వేదిక!
rajamahendravaram: టీడీపీ(tdp) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఏపీలో రాజమహేంద్రవరంలో మహానాడు(mahanadu) కార్యక్రమం గత రెండు రోజులుగా నిర్వహిస్తోంది. ఇక ఆదివారం చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు(tdp chief chandrababu) దాదాపు 40 నిమిషాలకు పైగా మాట్లాడారు. ఆయన స్పీచ్ ఆధ్యంతం సభకు హాజరైన టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఆకట్టుకుంది. ఇక మహానాడు వేదిక పైనుంచి చంద్రబాబు మినీ మేనిఫెస్టో(tdp manifesto)ని విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే.. తొలి విడతగా ఆరు పథకాలు అమలు చేస్తామని బాబు ప్రకటించారు.
”భవిష్యత్ కు గ్యారెంటీ” అనే పేరుతో చంద్రబాబు పలు పథకాలను ప్రకటించారు. మహిళల కోసం మహాశక్తి పథకం కింద.. ప్రతి మహిళ ఖాతాలో నెలకు 1500 వందల చొప్పున 18-59 ఏళ్ల మధ్య ఉన్న వారికి బ్యాంకు ఖాతాల్లో వేస్తాని చంద్రబాబు ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున.. ఏడాదికి రూ.18 వేలు అందుతాయన్నారు. అయిదేళ్లకు రూ.90 వేలు వస్తాయన్నారు. ఇక తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న పిల్లలు ఉన్న ప్రతి కుటుంబంలోని మహిళల ఖాతాలో రూ.15 వేలు వేస్తానన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తానన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాం కల్పిస్తామని అన్నారు. వచ్చే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇక నిరుద్యోగులకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 వేలు ఇస్తానని పేర్కొన్నారు. రైతన్నలకు ఫైనాన్షియల్ ఎయిడ్ కింద రూ.20 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఇక పూర్ టు రిచ్ కార్యక్రమంపై రానున్న రోజుల్లో కసరత్తు చేస్తామన్నారు. పేదలను సంపన్నులుగా చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పి చంద్రబాబు ప్రసంగం ముగించారు.