అవినాష్‌ను కస్టడీలోకి తీసుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి!
hyderabad: వైఎస్ వివేకా హత్య కేసు(viveka murder case)కు సంబంధించి సీబీఐ విచారణ(cbi investigation) వేగవంతం చేసింది. ఇక నిన్న, ఇవాళ వివేకా పీఏ కృష్ణారెడ్డి(viveka pa krishna reddy)ని, వివేకా ఇంట్లో పనిచేసే వంట మనిషి కుమారుడు ప్రకాష్‌ను అధికారులు విచారించారు. దీంతోపాటు వివేకా హత్య జరిగిన రోజు.. ఆయన రాసిన లెటర్‌కు సంబంధించి కృష్ణారెడ్డిని పలు విషయాలు అడిగారు. దీంతోపాటు ఇవాళ హైకోర్టు(ts high court)లో అవినాష్ రెడ్డి(mp avinash reddy) అరెస్టు పిటిషన్‌పై విచారణ సందర్బంగా సీబీఐ తన వాదనలను వినిపించింది. అవినాష్ విచారణకు సహకరించట్లేదని.. కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అతను బయట ఉంటే.. సాక్షులు, దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివేకాను హత్య చేయడం ఒక నేరమైతే.. సాక్ష్యాలను చెరిపివేయడం మరో నేరంగా తాము పరిగణిస్తున్నట్లు సీబీఐ చెబుతోంది. సాక్ష్యాలు చెరిపివేయడంలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, శివశంకర్ పాత్ర ఉందని పేర్కొంది. దీనిపై కోర్టు తీర్పు వెలువరించలేదు. అయితే.. సీబీఐ మాత్రం.. అవినాష్‌ను త్వరలో కస్టడీలోకి తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో సీబీఐ విచారణ జరుపుతోంది. మంగళవారం వైఎస్ సునీత (YS Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల (Rajashekhar Reddy) స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. వీరితోపాటు తాజాగా మరికొందరు అనుమానితులకు సీబీఐ నోటీసులు అందజేసింది. వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నించింది. వివేకా హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఇనయ్ తుల్లా అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే వివేకా మృతదేహాన్ని బాత్‌రూమ్ నుంచి బయటకు కూడా తీసుకొచ్చింది ఇనయ్ తుల్లానే. ఇనయ్ తుల్లాను గతంలోనే పులివెందులలో సీబీఐ విచారించింది.