Covid: మహారాష్ట్రలో పెరిగిన కేసులు..9 మంది మృతి
Mumbai : దేశంలో కరోనా వైరస్(corona virus) వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో(maharashtra) 1,115 కొత్త కేసులు వెలుగుచూడగా.. తొమ్మిది మంది చనిపోయినట్లు అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ(central health department) వెల్లడించింది. ఇక నిన్న 5000 పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఇప్పుడు ఏడు నెలల అత్యధికానికి కేసుల సంఖ్య చేరింది. దీంతో రోజువారీ పాజిటివిటీ(positivity rate) 3.65 శాతానికి పెరిగింది. తాజా వ్యాప్తితో క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 40 వేల(0.09శాతం)కు చేరింది. రికవరీ రేటు(recovery rate) 98.72 శాతంగా నమోదైంది. మొత్తం 11 మంది కొవిడ్‌తో చనిపోయినట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు మొత్తంగా 5,31,016 మంది మహమ్మారి(covid) బారిన పడి దేశంలో ప్రాణాలు కోల్పోయారు.