Khalistani ఉగ్రవాదిని చంపాడంటూ భారత రాయబారిపై వేటు
ఖలిస్థానీ (khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను (hardeep singh nijjar) చంపినందుకు కెనడాలో పనిచేస్తున్న భారత రాయబారిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) వేటు వేసారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే నిజ్జర్‌ను చంపినట్లు తెలిసిందని ట్రూడో ఆరోపించారు. ఆల్రెడీ ఈ ఖలిస్థానీల కారణంగా భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ట్రూడో భారత రాయబారిని తొలగించడంతో సంబంధాలు మరింత క్షీణించాయి. హర్దీప్‌పై గతేడాది జూన్‌లో ఎటాక్ జరిగింది. ఈ ఎటాక్‌లో అతను మరణించాడు. అయితే ఈ ఎటాక్‌లో భారత రాయబారి హస్తం ఉందని ట్రూడో ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఆయన్ను బహిష్కరించారు. ఈ చర్యపై భారత ప్రభుత్వం మండిపడింది. (khalistani terrorist)