Krishnamohan Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌.. కాంగ్రెస్‌కి జంప్ అయిన BRS ఎమ్మెల్యే మ‌ళ్లీ BRS గూటికి

BRS MLA from Gadwal who joined Congress a month ago meets ktr

Krishnamohan Reddy: కాంగ్రెస్ పార్టీ ప్ర‌లోభాల‌కు లొంగి కాంగ్రెస్‌లో చేరిన BRS గ‌ద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ BRS గూటికి చేర‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTRను క‌లిసి బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతాన‌ని కోరారు. అయితే పార్టీని క‌ష్ట‌కాలంలో వ‌దిలేసి వెళ్లిపోయేవారు మ‌ళ్లీ పార్టీలోకి వ‌స్తానంటే మాత్రం అస్స‌లు చేర్చుకోమ‌ని కేటీఆర్ ఇంత‌కుముందే వెల్ల‌డించారు. మ‌రి ఇప్పుడు కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కేటీఆర్‌ని క‌లిసి పార్టీలోకి తిరిగి వ‌స్తానంటే ఒప్పుకున్నారు. ఇది పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల‌కు ఏమాత్రం న‌చ్చ‌డంలేదు.