Telangana Elections: నల్గొండలో BRS పార్టీకి షాక్

న‌ల్గొండ‌లో BRS పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది (telangana elections). కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkat reddy) సమక్షంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ సహా 5 మంది కౌన్సిలర్లు నవీన్ గౌడ్, ప్రదీప్ నాయక్, జేరిపోతుల అశ్విని, ఖయ్యూం బేగ్, ఆసిమా సుల్తానాలు కాంగ్రెస్‌లో చేరారు.

మ‌రోప‌క్క‌ రేవంత్ రెడ్డి సమక్షంలో GHMC BRS ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు.. BRS పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు.