YS Sharmila పై బ్ర‌హ్మానందం సెటైర్లు

YS Sharmila: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌పై హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం (Brahmanandam) కామెంట్స్ చేసారు. ఓ ఈవెంట్‌లో బ్ర‌హ్మానందం ప‌క్క‌నే కేవీపీ రామచంద్ర‌రావు కూర్చుని ఉన్నారు. ఆ స‌మ‌యంలో బ్ర‌హ్మానందం కేవీపీతో ఏదో మాట్లాడి.. ఆ త‌ర్వాత ప‌క్క‌నే ఉన్న ఓ వ్య‌క్తిని పిలిచి.. ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి కానీ క‌లెక్ష‌న్లు డ‌ల్ అయ్యాయ‌ట ష‌ర్మిళ‌కు అంటూ ప‌క‌ప‌కా న‌వ్వుకున్నారు. దానికి ప‌క్క‌న ఉన్న వ్య‌క్తి క‌లెక్షన్లే ఇంపార్టెంట్ క‌దండీ అని కామెంట్ చేసారు. అయితే వారు ఏ విష‌యం గురించి ఇలా అన్నారో మాత్రం క్లారిటీ రాలేదు కానీ బ్ర‌హ్మి నోటి నుంచి ష‌ర్మిళ అనే ప‌దం రావ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.