Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో దంప‌తుల సెక్స్? ఆగ్ర‌హిస్తున్న నెటిజ‌న్లు

Bigg Boss hindi contestants sexual activity draws ire

Bigg Boss:  హిందీ బిగ్ బాస్ రోజు రోజుకీ రోత‌గా మారిపోతోంది. ఈసారి హిందీ బిగ్ బాస్ సీజ‌న్‌కి అనిల్ క‌పూర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో అర్మాన్ మాలిక్ అనే టిక్ టాక్ స్టార్ త‌న ఇద్ద‌రు భార్య‌ల‌తో క‌లిసి పాల్గొన్నాడు. ఇద్ద‌రు భార్య‌ల పాలసీని బిగ్ బాస్ ప్రోత్స‌హిస్తోంద‌ని ఆల్రెడీ వారిపై చాలా నెగిటివిటీ వ‌చ్చింది.

ఇది చాల‌ద‌న్న‌ట్లు ఈ అర్మాన్ మాలిక్ అనే వ్య‌క్తి త‌న మొద‌టి భార్య కృతిక‌తో ఒకే మంచంపై లైంగిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డ‌టం మ‌రో ద‌రిద్రం. ఇదంతా బిగ్ బాస్ కెమెరాల్లో రికార్డ్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజురోజుకీ పోర్న్ కంటే ద‌రిద్రంగా త‌యారవుతోంద‌ని మండిప‌డుతున్నారు.