Banglore: కంప్లైంట్ తీస్కోండి స‌ర్ అంటే నెంబ‌ర్ తీస్కొని….

Banglore: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లిన యువ‌తికి షాకింగ్ ఘ‌ట‌న ఎదురైంది. క‌ర్ణాట‌క(karnataka) రాజ‌ధాని బెంగ‌ళూరు(banglore)కు చెందిన ఓ యువ‌తి త‌న ఫ్రెండ్ విడాకుల కేసు విష‌యం గురించి ఫిర్యాదు చేయాల‌నుకుంది. సుద్ద‌గుంట‌పాళ్య‌ పోలీస్ స్టేష‌న్‌(police station)లో కంప్లైంట్ ఇవ్వ‌డానికి వెళ్లింది. అక్క‌డి ఇన్‌స్పెక్ట‌ర్ మంజునాథ్ కుర్చీలో కూర్చో అని చెప్పి అస‌భ్య‌క‌రంగా ట‌చ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె ట్విట‌ర్‌లో వెల్ల‌డించ‌డంతో తీవ్ర ర‌చ్చ‌కు దారితీసింది. ఫిర్యాదు చేస్తుండ‌గా అత‌ను పట్టించుకోక‌పోగా చెయ్యి ప‌ట్టుకుని లాగాడ‌ట‌. కంప్లైంట్ రాస్కోమంటే మొబైల్ నెంబ‌ర్ తీసుకుని, త‌ర్వాత రోజు ర‌మ్మాన్న‌డ‌ట‌. అంతేకాదు ఇంటికెళ్లాక ఫొటోలు వాట్సాప్ చేయాల‌ని కూడా చెప్పిన‌ట్లు వాపోయింది.

“ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత నుంచి నేను షాక్‌లో ఉన్నాను. ఇలా మీ ముందు ఈ విష‌యాన్ని చెప్పాల‌నుకున్నాను. ఇప్పుడు న‌న్ను ఏం చేయ‌మంటారు? కాపాడాల్సిన‌వారే ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు” అని ట్వీట్ చేస్తూ బెంగ‌ళూరు పోలీసుల‌ను ట్యాగ్ చేసింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలీదు కానీ ఆమె ట్వీట్లు డిలీట్ చేసింది. అయితే ఆ యువ‌తి త‌న ఆఫీస్‌కి వ‌చ్చి ఇన్‌స్పెక్ట‌ర్‌పై ఫిర్యాదు చేసింద‌ని, త్వ‌ర‌లో యాక్ష‌న్ తీసుకుంటామ‌ని డీసీపీ సీకే బాబా తెలిపారు.