మీరు ఇల్లు ఖాళీ చేయిస్తే.. ప్ర‌జ‌లు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు

Hyderabad: ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్‌(bandla ganesh).. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి(rahul gandhi) స‌పోర్ట్‌గా నిలిచారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అద్భుత విజ‌యాన్ని ద‌క్కించుకుంది. రేపో మాపో ప్ర‌భుత్వాన్ని నిర్మించ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. “మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే… కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు.!!” అంటూ కేంద్రంపై సెటైర్ వేసారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాహుల్ గాంధీ కోలార్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ.. మోదీ పేరున్న‌వారంతా దొంగ‌లే అని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. దాంతో గుజరాత్‌లోని సూర‌త్‌కు చెందిన అడ్వొకేట్‌.. రాహుల్‌పై దావా వేసారు. దీనిపై విచారించిన సూర‌త్ న్యాయ‌స్థానం.. రాహుల్ దోషి అని తేలుస్తూ రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ త‌ర్వాత రాహుల్ అప్పీల్ పెట్టుకున్న‌ప్ప‌టికీ కోర్టు తీర్పులో ఎలాంటి మార్పు లేదు. అదే స‌మ‌యంలో రాహుల్‌పై లోక్‌స‌భ‌లో అన‌ర్హ‌త వేటు వేసారు. దాంతో దిల్లీలోని అధికారిక కార్యాల‌యం నుంచి రాహుల్‌ను ఖాళీ చేయించారు. దానిని ఉద్దేశిస్తూనే బండ్ల గ‌ణేష్ ఈ ట్వీట్ చేసారు.