నాడు: రాజ‌మౌళిని చంపుతాం నేడు: రాజ‌మౌళికి కంగ్రాట్స్

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి మొత్తానికి సాధించేసారు. ఆయ‌న తెరకెక్కించిన అద్భుత దృశ్య‌కావ్యం ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ వ‌రించేసింది. యావ‌త్ భార‌త‌దేశం ఈ విష‌యంలో ఎంతో గ‌ర్విస్తోంది. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీలు, పారిశ్రామిక‌వేత్త‌ల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే బీజేపీ నేత బండి సంజ‌య్‌.. అప్ప‌ట్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై, దానిని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కావ‌డానికి కొన్ని రోజులు ఉంద‌న‌గా.. చిత్ర‌బృందం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసింది. ట్రైల‌ర్‌లో కొమురం భీం పాత్ర‌లో న‌టించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. త‌న‌కు ముస్లింలు పెట్టుకునే తెల్ల టోపీ ధ‌రించిన‌ట్లు చూపించారు. ఈ విష‌యంపై బండి సంజ‌య్ అప్ప‌ట్లో సంచ‌ల‌న కామెంట్లు చేసారు. “మ‌న కొమురం భీంకు రాజ‌మౌళి తెల్ల టోపీ పెట్టాడు. ఊరుకుంటామా? ద‌మ్ముంటే.. పాత బ‌స్తీ నుంచి ఒక‌రిని తెచ్చి వాడి నుదుట‌న బొట్టు పెట్టి, మెడ‌లో కాషాయ జెండా వేసి వాడిపై సినిమా తీయి. నువ్వు కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమాను రిలీజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తే ఎక్క‌డ సినిమా ఆడినా అక్క‌డ థియేట‌ర్లు త‌గ‌ల‌బెడ‌తాం. కొమురం భీంను కించ‌ప‌రిచే విధంగా ఆదివాసీల హ‌క్కుల‌ను కించ‌ప‌రిచే విధంగా సినిమా తీయాల‌ని చూస్తే నిన్ను కొట్టి కొట్టి చంపుతాం” అన్నారు. ఇప్పుడు నాటు నాటు పాట‌కు ఆస్కార్ రాగానే.. సాటి తెలుగువాడిగా మ‌న సినిమాకు ఆస్కార్ వ‌చ్చినందుకు గ‌ర్విస్తున్నాన‌ని ట్వీట్ చేసారు.

ఆదివాసీల‌పై అంత ప్రేమ ఉన్న‌ట్లు న‌టించి.. ఇప్పుడు ఆస్కార్ అవార్డు రాగానే గ‌ర్వంగా ఉందని ట్వీట్ చేయ‌డంపై బీఆర్ఎస్ నేత స‌తీష్ రెడ్డి కామెంట్ చేసారు. అప్ప‌ట్లో బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న వెన‌క్కి తీసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్తారా? అని ట్విట‌ర్ వేదిక‌గా నిల‌దీసారు. మ‌రి దీనిపై బండి సంజ‌య్ ఏమ‌ని స్పందిస్తారో చూడాలి.