తారక రత్న పెద్దకర్మలో ఎన్టీఆర్‌ను పట్టించుకోని బాలయ్య?
నటసింహ నందమూరి బాలకృష్ణ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను పట్టించుకోవడం లేదా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ సోదరుడు, సినీ నటుడు తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న తారకరత్నది పెద్ద కర్మ కార్యక్రమం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులంతా వచ్చారు. అయితే బాలకృష్ణ రాగానే వెంటనే ఆయన్ను పలకరించడానికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లేచి నిలబడ్డారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అక్కడున్న కల్యాణ్ రామ్‌ను, ఓ కుటుంబ సభ్యురాలిని పలకరించారే తప్ప తారక్‌ను మాత్రం పలకరించలేదు. దాంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. పెద్ద కర్మ సమయంలోని ఈ వీడియోను పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు ట్విటర్‌లో షేర్ చేస్తూ.. నిజంగా పాపం అనిపిస్తోంది అని కామెంట్ చేస్తూ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసారు.
అసలు ఎందుకు బాలయ్య.. తారక్‌ను పట్టించుకోవడం లేదు? ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయబేధాలు ఉన్నాయా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరో పక్క తారక్ అభిమానులు మాత్రం.. ఆయనే బాలయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ సినిమాల పరంగా దూసుకెళ్తున్నారు. ఎక్కడా కూడా పోటీ కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ జెనరేషన్ వేరు బాలయ్య జనరేషన్ వేరు. అలాంటప్పుడు ఇక్కడ ఫ్యాన్ వార్స్ కూడా తావు లేదు. మరోపక్క చిరంజీవి కుటుంబం నుంచి ఏ నటుడి సినిమా రిలీజ్ ఉన్నా కూడా చిరంజీవి కానీ పవన్ కల్యాణ్ కానీ తప్పకుండా హాజరయ్యి వారికి అండగా నిలబడతారు. అదే విధంగా ప్రభాస్ సినిమాలకు ఆయన పెదనాన్న కృష్ణం రాజు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుండేవారు. కానీ బాలయ్య నుంచి మాత్రం ఆ సపోర్ట్ తారక్‌కు లేదనే అనిపిస్తోందన్న ఊహాగానాలు ఉన్నాయి.అంతేకాదు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని యావత్ ప్రపంచం తిలకించింది. ఆస్కార్ వేడుకల వరకూ వెళ్లింది. ఓపక్క తన అన్న కుమారుడు నటించిన సినిమాకు గ్లోబల్‌గా గుర్తింపు దక్కుతున్నందుకు సినీ నటుడు పవన్ కల్యాణ్.. రామ్ చరణ్‌ను మెచ్చకుంటూ ఇటీవల ఓ లేఖను విడుదల చేసారు. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ గురించి పొగుడ్తూ ఒక్క ట్వీట్ కానీ కామెంట్ కానీ చేయకపోవడం గమనార్హం. కానీ బాలయ్య కోసం మాత్రం ఎన్టీఆర్ సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుండేవారు. తన బాబాయి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఆయనకు సంబంధించిన ఏ ఈవెంట్ ఉన్నా కూడా తారక్ సపోర్ట్ చేస్తుండేవారు. బాబాయ్ అబ్బాయ్ మధ్య ఏదో తెలీని వారే జరుగుతోందని అంటున్నారు.మరోపక్క కావాలనే వారి మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మరికొందరు అభిమానులు అంటున్నారు.