స్టార్​ హీరోను డైరెక్ట్​ చెయ్యనున్న వేణు!

Hyderabad: టాలీవుడ్​ సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు(Venu Tillu) తొలిసారి మెగాఫోన్​ పట్టి రూపొందించిన సినిమా బలగం(Balagam). చిన్న సినిమాగా విడుదలైన బలగం అశేష ప్రేక్షకాదరణ పొంది బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. ప్రముఖ నిర్మాత దిల్​ రాజు(Dil Raju) సమర్పణలో విడుదలైన ఈ సినిమాతో వేణు దర్శకుడిగా అందరినీ మెప్పించాడు. ప్రియదర్శి(Priyadarshi), కావ్య కల్యాణ్​రామ్(Kavya Kalyan Ram)​ జంటగా నటించిన ఈ సినిమా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా తెరకెక్కింది.  బలగం సినిమాని చూసి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా వేణుని ప్రత్యేకంగా అభినందించారు. కాగా, ప్రస్తుతం వేణు కి డైరెక్టర్ గా అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

తాజాగా వేణు, నేచురల్​ స్టార్ నాని(Natural star Nai) ని కలిసి ఒక అద్భుతమైన కథని వినిపించాడట, ఆ కథ విన్న తర్వాత భావోద్వేగానికి లోనై, ‘ఈ సినిమా మనం తప్పకుండ చేస్తున్నాము. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చెయ్యి, నాకు ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అవ్వగానే ఈ సినిమాకి డేట్స్ ఇస్తాను’ అన్నాడట నాని. కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో ముందుండే నాని వేణుతో సినిమా చేస్తే ఇద్దరికీ బాగా కలిసొస్తుందనే టాక్​ వినిపిస్తోంది. తాజాగా దసరా(Dasara) సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకున్న నాని మంచి జోష్​లో ఉన్నారు. శ్రీకాంత్​ ఓదెల(Srikanth Odela) తెరకెక్కించిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టి సన్సేషన్​ క్రియేట్​ చేసిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్​(Keerthy Suresh) హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్​తో రికార్డులు బ్రేక్​ చేస్తోంది.