Avinash Reddy: హంత‌కుడంటూ ష‌ర్మిళ నింద‌లు.. అవినాష్ స్పంద‌నేంటి?

Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డిని హ‌త్య చేసిన అవినాష్ రెడ్డికి ఓటేస్తారా.. వైఎస్సార్ బిడ్డ‌కు ఓటేస్తారా అంటూ క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ (YS Sharmila) చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకోమంటారని స‌రే అని తుడుచుకుంటూ పోతే నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నార‌ని అన్నారు.

“” నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకోమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకోనివ్వండి. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా “” అని మండిప‌డ్డారు అవినాష్ రెడ్డి.