నాకు మెంటలో కాదో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాని, దర్శకుడు శ్రీకాంత్, కీర్తి సురేష్ భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్.. నానిని ఇంటర్వ్యూ చేసారు. శ్రీకాంత్‌కు దసరా తొలి సినిమా. కానీ నాని.. ఆల్రెడీ పెద్ద దర్శకులతో పనిచేసి స్టార్‌డం సంపాదించుకున్నారు. దాంతో శ్రీకాంత్.. నానిని ఓ ప్రశ్న అడిగారు.
“మీరు నా కథ వినడమే గొప్ప అనుకుంటే.. నా కథ ఒకే చేసేసారు. ఆ షాక్‌లో నేను అసలు నాని నా కథ ఎలా ఓకే చేసారు ఆయనకేమన్నా మెంటలా అనుకున్నాను” అన్నారు. ఇందుకు నాని సమాధానంగా..”దసరా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చెప్తారు నానికి మెంటలా కాదా అని. నాకు కథ చెప్పగానే నేను ఫిక్స్ అయిపోయాను. సినిమా బ్లాక్‌బస్టర్. మనకు ఒక ఒరిజినల్ డైరెక్టర్ దొరికేసాడు అనిపించింది. ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నేను ఎంతగా చేసినా శ్రీకాంత్ ఓకే చేయట్లేదు. కొత్త డైరెక్టర్లకు షూటింగ్ మొదటిరోజు నాకు అసలు డైరెక్షన్ వచ్చా అనే డౌట్ వస్తుంటుంది. కానీ శ్రీకాంత్‌ని చూసాక అసలు నాకు యాక్టింగ్ వచ్చా అనిపించింది” అని తెలిపారు.
ఆ తర్వాత కీర్తి సురేష్‌ని ఉద్దేశిస్తూ.. “దసరా స్టోరీ కీర్తికి చెప్పినప్పుడు ఆమె రిజెక్ట్ చేసారు. హమ్మయ్య అనుకున్నాను అన్నారు. కీర్తి తీసుకోవాలని నాని సజెస్ట్ చేసారు. కానీ సెట్స్‌లో ఇద్దరు టాప్ స్టార్స్ ఉంటే హ్యాండిల్ చేయలేం కాబట్టి కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకుందాం అనుకున్నా. కానీ కీర్తి అయితేనే బాగుంటుంది అని నాని అనడంతో ఆమెకు కథ చెప్పా. ఆమె నో అనడంతో నానికి ఈ మ్యాటర్ చెప్పి వేరే అమ్మాయిని వెతుకుదాం అనుకున్నా. కొన్నిరోజుల తర్వాత సరిగ్గా కథను నరేట్ చేస్తే అప్పుడు కీర్తి ఓకే అన్నారు. సినిమా షూటింగ్ మధ్యలో కీర్తిని తీసేసి వేరే అమ్మాయిని పెట్టుకుందామా అని నాని అన్నకు చెప్పాను. కానీ షూటింగ్ మొత్తం అయ్యాక కీర్తి కాకుండా వేరొకరిని హీరోయిన్‌గా ఊహించుకోలేకపోయా” అని తెలిపారు శ్రీకాంత్.