“ప్ర‌శ్న‌లుంటే ఇప్పుడే అడ‌గండి.. బ‌తికుంటామో లేదో”

ask now itself if there are anymore questions says salim khan

Salim Khan: బాలీవుడ్ స్టార్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌కు క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణ‌హాని ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టివ‌ర‌కు స్ట్రాంగ్‌గా ఉన్న స‌ల్మాన్.. త‌న‌కు తండ్రి లాంటివారైన NCP నేత బాబా సిద్ధిఖీ హ‌త్య‌కు గుర‌వ‌డంతో నిద్ర‌లేని రాత్రుళ్లు గ‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్ తండ్రి స‌లీమ్ ఖాన్ మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు.

“” నా బిడ్డ స‌ల్మాన్ ఖాన్ ఏ బ్లాక్ బ‌క్ జింకనూ చంపలేదు. స‌ల్మాన్‌కి జంతువులంటే ప్రాణం. నేనే స్వ‌యంగా స‌ల్మాన్‌ని అడిగాను నువ్వు జింక‌ను చంపావా అని. లేదు నాన్నా అని చెప్పాడు. నా బిడ్డ అబ‌ద్ధం చెప్ప‌డు. క‌నీసం తండ్రితోనైనా నిజం చెప్తాడు క‌దా. అలాంట‌ప్పుడు లారెన్స్ బిష్ణోయ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పు అని బెదిరిస్తున్న‌ప్పుడు ఎలా చెప్తాడు? ఒకవేళ క్ష‌మాప‌ణ‌లు చెప్తే తాను జింక‌ను చంపాన‌ని ఒప్పుకున్న‌ట్లే క‌దా. అందుకే క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంలేదు. 20 ఏళ్ల నుంచి ఈ కేసు స‌ల్మాన్‌ని వెంటాడుతూనే ఉంది. ఇంకా ఏమైనా ప్ర‌శ్న‌లు ఉన్నాయా? ఏమ‌న్నా ఉంటే ఇప్పుడే అడిగేయండి. మ‌ళ్లీ మేం బ‌తికుంటామో లేదో తెలీదు “” అంటూ స‌లీమ్ ఖాన్ కంట‌త‌డి పెట్టుకున్నారు.

మ‌రోప‌క్క స‌ల్మాన్‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ఎందుకైనా మంచిద‌ని స‌ల్మాన్ రూ.2 కోట్లు పెట్టి దుబాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారు తెప్పించుకున్నారు. ఆయ‌న వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ 18వ సీజ‌న్ షూటింగ్ ప్రాంతాల్లో కూడా 60 మంది పోలీసుల భ‌ద్ర‌తను ఏర్పాటుచేసుకున్నారు. ఎవ్వ‌రినీ లోప‌లికి అనుమ‌తించ‌డంలేదు.