Arvind Kejriwal: గవర్నర్ సాబ్.. ఏదో ఒకటి చేయండి
Delhi: దిల్లీలో జరిగిన 16 ఏళ్ల బాలిక మర్డర్ ఘటనపై స్పందించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal). రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూసుకోవాల్సిన బాధ్యతల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎల్కే సక్సేనా (lk saxena) దేనని అన్నారు. వెంటనే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసారు. “దిల్లీలో మైనర్ బాలిక దారుణంగా హత్యకు గురైంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత గవర్న్ ఎల్కే సక్సేనాదే. ఈ రోజుల్లో క్రిమినల్స్ అసలు పోలీసులకు భయపడటం లేదు. గవర్నర్ గారూ త్వరగా ఏదో ఒక యాక్షన్ తీసుకోండి” అని ట్వీట్ చేసారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రోహిణి ప్రాంతానికి చెందిన సాక్షి, సాహిల్ అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. దాంతో సాక్షిపై కోపం పెంచుకున్న సాహిల్ ఆమె చంపాలనుకున్నాడు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో సాక్షి తన ఫ్రెండ్ కొడుకు బర్త్‌డే పార్టీకి అని వెళ్తుండగా సాహిల్ కాపు కాసి నడిరోడ్డుపై కత్తితో పొడిచేసాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న బండరాయి పలుమార్లు దాడి చేసాడు. దాంతో సాక్షి అక్కడికక్కడే చనిపోయింది. అందరూ చూస్తుండగా ఈ దారుణం జరుగుతున్నప్పటికీ ఒక్కరూ ఆపలేకపోయారు. ఈ ఘోరం సీటీటీవీలో రికార్డు కావడంతో సంచలనంగా మారింది. పోలీసులు సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.