Art Therapy: మందుల్లేని వైద్యం!
Hyderabad: సంగీతం(Music), డ్యాన్స్(Dance), పెయింటింగ్.. ఇలాంటి కళలు వినోదంతోపాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అందుకే వీటిని పలు థెరపీలుగా ఉపయోగించి ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తున్నారు నిపుణులు. శారీరక, మానసిక ఆరోగ్యాల(Health) కోసం, భావోద్వేగాల నియంత్రణ కోసం వివిధ రకాల కళలను థెరపీగా శతాబ్దాల నుంచి వాడుతున్నారు. ఆ థెరపీలేంటో మనమూ తెలుసుకుందాం..
మ్యూజిక్ థెరపీ
శ్రావ్యమైన సంగీతం మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యంపైనా మంచి ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం బాధ, ఆందోళన, దీర్ఘాకలిక బాధలు, నొప్పుల నుంచి సంగీతం వల్ల ఉపశమనం ఉంటుందట.
ఆర్ట్ థెరపీ
ఇది ఒకరకమైన మానసిక చికిత్స. మానసిక అనారోగ్యం, ఆందోళన, నిరాశ తగ్గించడానికి ఈ పద్ధతి వాడతారు. క్యాన్సర్ లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి శారీరక ఆరోగ్య పరిస్థితులతో బాధపడే వ్యక్తులకు కూడా ఆర్ట్ థెరపీ సహాయపడుతుంది.
డ్యాన్స్ థెరపీ
శరీర కదలికలు, డ్యాన్స్ ద్వారా భావోద్వేగ, అభిజ్ఞా, శారీరక శ్రేయస్సు కోసం దీన్ని వాడతారు. ఊబకాయం, మధుమేహం, ఆందోళనతో బాధ పడుతున్న వాళ్లకి ఇది మంచి ఫలితాలిస్తుందని తేలింది. డ్యాన్స్ థెరపీ వృద్ధులలో సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
పబ్లిక్ ఆర్ట్
నలుగురిలో కలిసిపోవడం, మనసులో మాట పంచుకోవడాన్ని పబ్లిక్ ఆర్ట్ అంటారు. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం నచ్చిన ప్రదేశంలో ఇష్టమైన మనుషుల మధ్య గడపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది సాధారణంగా వైద్యులు సూచించే సలహా.