AP: హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ
AP: ఆంధ్రప్రదేశ్(ap) హైకోర్టు(highcourt)లో YCPకి ఎదురుదెబ్బ తలిగింది. వైసీపీ ప్రవేశపెట్టిన జీవో నెం 1ను(go 1) కొట్టేసింది. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని హైకోర్టు కామెంట్స్ చేసింది. రోడ్లపై బహిరంగ సభలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం జనవరిలో ఈ జీవో నెంబర్-1ను తీసుకొచ్చింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. సీఎం జగన్ ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తున్నారని, అడుగడుగునా కట్టడి చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డాయి. తమకు న్యాయం చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదనంతరం జీవో నం1 వల్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించి.. దాన్ని రద్దు చేస్తున్నట్లు న్యాయస్తానం పేర్కొంది. దీనిపై వైసీపీ పార్టీ నుంచి ఏ నాయకుడు ఇప్పటికైతే స్పందించలేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన సభ, కందుకూరులో జరిగిన రోడ్ షోలో తొక్కిసలాట కారణంగా పలువురు చనిపోయారు. దీంతో అలాంటి పరిస్థితి రాకూడదన్న కారణంతో ప్రభుత్వం ఈ జీవో 1ని తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఉందని హైకోర్టును ఆశ్రయించారు.