Anushka Sharma: ట్రాఫిక్ తప్పించుకోడానికి లిఫ్ట్!
Mumbai: దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్(Traffic) కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్.. లాంటి పలు నగరాల్లో సెలబ్రిటీలకూ ట్రాఫిక్ సమస్యగానే మారుతోంది. సామాన్యులు ట్రాఫిక్ సమస్యని తప్పించుకోవడానికి కార్లు ఉన్నా బైక్స్(Bikes), మెట్రో(Metro) వాడుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో పలువురు సెలబ్రిటీలు కూడా బైకులపై ప్రయాణించడం ట్రెండ్‌గా మారుతోంది.
ఇటీవల సారా అలీఖాన్, హేమ మాలిని, నవాజుద్దీన్.. వంటి పలువురు సెలబ్రిటీలు ముంబై ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి మెట్రోలో ప్రయాణించారు. ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్(Amitabh Bachchan) షూటింగ్ కి వెళ్తుంటే ముంబైలో ట్రాఫిక్ బాగా ఉండటంతో మధ్యలోనే కార్ దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి షూటింగ్ కు వెళ్లారు. వైరల్ గా మారిన ఫొటోని అమితాబ్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ బైకర్ కు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.
ఇక తాజాగా ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కొహ్లీ(Virat Kohli) సతీమని అనుష్క శర్మ(Anushka Sharma) కూడా చేరిపోయింది. ముంబైలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో తన బాడీగార్డ్ బైక్ మీద షూటింగ్ కి వెళ్ళింది అనుష్క శర్మ. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అమితాబ్, అనుష్క.. ఇద్దరినీ బైక్ ఎక్కించుకొని డ్రైవ్ చేసిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పలువురు నెటిజన్లు హెల్మెట్స్ పెట్టుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ మాకేనా రూల్స్, సెలబ్రిటీలకు లేవా అని పోస్టులు చేస్తున్నారు.