విడాకులు తీసుకోబోతున్న మరో బాలీవుడ్ జంట!
ఈమధ్య కాలంలో ప్రేమ, పెళ్లిళ్లు, డేటింగ్ ఎంత కామనో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే మరీ సహజంగా మారిపోయింది. కొంతమంది నటీనటులు పెళ్లైన కొన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టాక విడిపోతే మరికొంతమందేమో పెళ్లయిన సంవత్సరానికే విడిపోతారు. ఇక అలాంటి జాబితాలో ఇప్పటికే ఎంతోమంది చేరిపోయారు. అంతేకాదు విడిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా అనేకం. అయితే తాజాగా బాలీవుడ్లో ఓ స్టార్ జంట విడిపోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు స్టార్ హీరో హీరోయిన్ అయినా రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనే. అయితే వీరి విషయంలో విడాకుల వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పటికే రణ్ వీర్ దీపిక ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. దానికి ప్రధాన కారణం వీరిద్దరి పెళ్ళై నాలుగు సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పిల్లల్ని కనడం లేదు. అయితే ఈ విషయంలో ఎన్ని సార్లు అడిగినా కూడా వీరు అలాంటిదేమీ లేదు అంటూ విషయాన్ని దాటేశారు.
అయితే తాజాగా వీరిద్దరి మధ్య అంతగా సఖ్యత లేదని నిరూపించేలా ఓ వీడియో బయటకు వచ్చింది. దాంతో విడాకుల వార్తలు నిజమేనంటున్నారు నెటిజన్లు. ఇటీవల ముంబైలో జరిగిన స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ లో పాల్గొన్న దీపిక, రణ్‌వీర్‌లు వారి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయన్నట్లుగానే ప్రవర్తించారు. ఇద్దరూ ఒకే కారులో ఈవెంట్‌కు వచ్చినా.. రెడ్ కార్పెట్ పై విడివిడిగా నడిచారు. అంతేకాదు రణ్వీర్ చెయ్యి పట్టుకోవాలని ప్రయత్నిస్తే దీపిక విసురుగా ముందుకు వెళ్లిపోయింది. వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ స్టార్ జంట కూడా విడాకులు తీసుకోవడం ఖాయం అంటున్నారు.
అయితే వీరిద్దరూ గత ఏడాది నుండే దూరంగా ఉంటున్నారని, ఇప్పటికే ఆస్తులన్నీ ఎవరివి వారు పంచేసుకున్నారని, ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు గానే ఉంటున్నారని తెలుస్తోంది. కానీ అఫీషియల్ గా విడాకులు వచ్చేవరకు అలా కలిసి కొన్ని ఈవెంట్లలో పాల్గొంటున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వీరిద్దరూ కలిసే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇక వీరి వివాహం 2018 నవంబర్ 14,15 తేదీల్లో ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.