Ambati rambabu: పవన్‌, చంద్రబాబుల మధ్య క్యాష్ మార్పిడి జరుగుతుందేమో?

vijayawada: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(tdp chief chandrababu naidu), జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌(janasena chief pavan kalyan) ఇటీవల హైదరాబాద్‌(hyderabad)లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక వీరి కలయికపై జనసేన పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్‌(nadendla manohar) మాట్లాడుతూ.. వైసీపీ(ycp) విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంతో పవన్‌, చంద్రబాబు కలిశారని.. వైసీపీ అరాచక పాలనపై చర్చించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ వ్యతిరేక కూటములు కలిసి వైసీపీపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక మనోహర్ వ్యాఖ్యలు ఇలా ఉండగా.. తాజా.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(minister ambati rambabu)… పవన్‌, చంద్రబాబు భేటీపై ఘాటుగా స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంలో పెళ్లి ఒకరితో.. సంసారం ఒకరితో అన్నట్లుగానే.. రాజకీయాల్లో కూడా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుని కలుస్తూనే ఉంటారని,,, వారెప్పుడూ విడిపోలేదని చెప్పారు. సినిమాలో డైలాగ్‌ చెప్పినట్లు చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లు.. పవన్‌ చంద్రబాబు కలుస్తుంటారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఇన్నిసార్లు కలుస్తున్నారు అంటే.. క్యాష్‌ మార్పిడి ఏమైనా జరుగుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్‌ పని.. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబులను కలపడమేనని అన్నారు. ఇవన్నీ అనైతిక కలయికలని దుయ్యబట్టారు.