థాంక్యూ చిక‌బాబి: చిరుకి బ‌న్నీ రిప్లై

‘గంగోత్రి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులను అలరించే సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్​ స్టార్​ హీరోగా ఎదిగారు. స్టైలిష్‌ స్టార్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించిన బన్నీ 2021లో విడుదలైన ‘పుష్ప’ తో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరించారు బన్నీ. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం, పాటలు, డాన్సులు అన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను కూడా ఫిదా చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక, మార్చి 28, 2023తో బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్​ పెట్టారు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​.

కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానికి బదులుగా బన్నీ కూడా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లపైనే చర్చ జరుగుతోంది. తాజాగా బన్నీ నటించిన మొదటి సినిమా గంగోత్రి విడుదలై 20 ఏళ్లు పూర్తయ్యింది. ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగారు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా క్రేజ్‌ను కూడా దక్కించుకున్నారు.

అల్లు అర్జున్ తొలి సినిమా విడుదలై 2‌0 సంవత్సరాలు పూర్తయి సందర్భంగా చిరంజీవి ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘డియర్ బన్నీ.. సినీ పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నీ చిన్ననాటి రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సమయం చాల వేగంగా గడిచిపోయింది. ఒక సాధారణ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నువ్వు.. పాన్‌ ఇండియా స్టార్‌‌గా, ఐకాన్‌ స్టార్‌‌గా ఎదిగావు. నీ అభివృద్ధి చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరెన్నో విజయాలను అందుకోవాలని, ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆశిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

చిరంజీవి చేసిన ట్వీట్‌కు బన్నీ స్పందించారు. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఆశీస్సులు, అభినందనలకు కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పటికీ గుండెల్లో ఉంచుకుని ముందుగా కొనసాగుతాం. థాంక్యూ చిక‌బాబి ’ అంటూ హార్ట్‌ సింబల్‌ పెట్టి బన్నీ ట్వీట్ చేశారు. బ‌హుశా బ‌న్నీ.. చిరుని ముద్దుగా చిక‌బాబి అని పిలుస్తారేమో పేరు బ‌లేగుంది అంటూ మెగా, అల్లు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’, ‘డాడీ’ సినిమాల్లో బాలనటుడిగా అల్లు అర్జున్ కనిపించారు.

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్‌తో జోరు మీదున్నారు చిరు. ఈ క్రమంలోనే భోళా శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మెహెర్‌‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవికి చెల్లెలుగా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్, ఉగాదికి విడుదలైన పోస్టర్‌‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.