మాస్ లుక్‌లో అల్లు అర్జున్.. ఆ సినిమా కోసమేనా!
‘పుష్ప’ సినిమాతో పాన్ఇండియా స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీక్వెల్‌తో బిజీగా ఉన్న ఐకానిక్ స్టార్ తాజాగా ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఊహలకందకుండా మొదటి సినిమా అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తరువాతి సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అల్లు అర్జున్ కెరీర్ లో 23వ సినిమాగా రానున్న ఈ సినిమాను AA23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.సినిమాను డిఫరెంట్ స్టైల్ లో రూపొందించడమే కాదు ఆ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసి జనం దృష్టిని లాగడంలోనూ సందీప్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే టాక్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతూ ఈ సినిమాకు భద్రకాళి అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా బయటికి వచ్చిన పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది. పవర్ హౌస్ అంటూ సిగార్ కాలుస్తున్న అర్జున్ మాస్‌లుక్ అదిరిపోయింది. పుష్పలోని మాస్‌లుక్‌కి రెట్టింపు క్రేజ్‌ని దక్కించుకుంటోంది.
AA23 సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ నిర్మిస్తుండటం, సందీప్ రెడ్డి లాంటి స్టైలిష్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తుండటం పట్ల బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమా 2024లో మొదలు పెట్టి 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ కెరీర్‌కూ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది అర్జున్ రెడ్డి. ఆ తర్వాత అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీ రీమేక్ చేసి బాలీవుడ్ లో ట్రెండ్ అయ్యారు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా సత్తా చాటిన ఆయన.. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ప్రకటించిన సందీప్ ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. ఈ రెండు పూర్తయ్యాకే అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని సమాచారం. మరి అల్లు అర్జున్ కోసం సందీప్‌రెడ్డి ఎలాంటి కథ సిద్ధం చేయనున్నాడన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు పుష్ప 2 మూవీతో బన్నీ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప సినిమాకు సీక్వల్ గా రాబోతున్న ఈ భారీ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్, బన్ని కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే 2025 వరకు వేచి ఉండక తప్పదు!