Pushpa-The Rule: అమ్మోరు అవ‌తార‌మెత్తిన అల్లు అర్జున్.. !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప- ది రూల్ సంద‌డి మొద‌లైపోయింది. పుష్ప ఎక్క‌డ అనే టైటిల్‌తో ఇప్ప‌టికే చిత్ర‌బృందం ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో బ‌న్నీకి సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి తెగ వైర‌ల్ అవుతోంది. బ‌న్నీ చీర క‌ట్టుకుని, న‌గ‌లు, ముక్కు పుడ‌క, మెడ‌లో నిమ్మ‌కాయ‌ల దండ‌, చేతిలో రివాల్వ‌ర్‌తో క్రేజీ లుక్‌లో కనిపిస్తున్నారు. బ‌న్నీలాంటి స్టార్‌డం ఉన్న హీరో ఇలా చీర క‌ట్టులో క‌నిపిస్తార‌ని అస‌లు ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప‌- ది రైజ్ సినిమా బ‌న్నీ కెరీర్‌లోనే డిఫ‌రెంట్ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ది రూల్‌తో అంత‌కుమించి ర‌చ్చ చేయ‌బోతున్నారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు ఫాహ‌ద్ ఫాసిల్ ఈ సినిమాలో షెకావ‌త్ బ‌న్వ‌ర్‌లాల్ అనే పోలీసు పాత్ర‌లో విల‌న్‌గా నటిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. సినిమా మొత్తం ఫాహ‌ద్‌, బ‌న్నీ మ‌ధ్యే ఉంటుంద‌ని టాక్. బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో కూడా చూసేయండి.