Lifestyle: బ్రేకప్ సెక్స్.. ఈ ట్రెండ్‌తో జాగ్రత్త
Lifestyle: బ్రేకప్ అయితే తిట్టుకునో కొట్టుకునో విడిపోతారు. కానీ ఇప్పుడు ఒక దిక్కుమాలిన ట్రెండ్ నడుస్తోంది. బ్రేకప్ సెక్స్ అట. అంటే ఎటూ బ్రేకప్ చెప్పుకుంటున్నాం కదా.. ఒకసారి శారీరకంగా కలుద్దాం అని ఇద్దరూ పరస్పరంగా ఒప్పుకుని చేసుకునే ప్రక్రియ. ఇలాంటి ట్రెండ్స్‌తో జాగ్రత్త అని అంటున్నారు రిలేషన్‌షిప్ కౌన్సిలర్ రుచీ రూహ్. విడిపోవాలనుకున్నప్పుడు సామరస్యంగా గుడ్‌బై చెప్పుకోకుండా చివరిసారి శారీరంగా కలుద్దాం అనుకోవడం కరెక్ట్ కాదని.. దీని వల్ల ఆ బ్రేకప్ చెప్పలేక నలిగిపోతుంటారని అన్నారు.
మూవ్ ఆన్ అవ్వలేరు
ఈ బ్రేకప్ సెక్స్ వల్ల మూవ్ ఆన్ అవ్వలేరు. మళ్లీ మళ్లీ మాజీలే గుర్తొస్తుంటారు. భవిష్యత్తులో మళ్లీ వస్తారులే అనే ఆశలు కలుగుతాయి.
కోలుకోలేరు
బ్రేకప్ తర్వాత ముందుగా ఆ మనిషి పూర్తిగా హీల్ అవ్వాలి. అంటే కోలుకోవాలి. ఈ బ్రేకప్ సెక్స్ వల్ల ఆ హీలింగ్ ప్రక్రియ చాలా కఠినతరం అవుతుంది.
పగ పెరిగిపోతుంది
ఒకవేళ మోసం వల్లో లేదా ఇతర ద్వేషపూరిత కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకుంటున్నప్పుడు ఈ బ్రేకప్ సెక్స్ మరింత పెగ పెంచుకునేలా చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం.