‘దేశప్రజలంతా మాతోనే..’ ఆస్కార్​పై ఎన్టీఆర్​ ఎమోష‌న‌ల్ కామెంట్

ఎస్​.ఎస్​. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా RRR.విడుదలై ఏడాది కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా హవా ఏ మాత్రం తగ్గలేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకుంది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఆస్కార్​ బరిలో నిలబడి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భారతదేశం తరపున అషీషియల్​గా ఎంట్రీ దక్కకపోయినా స్వతంత్రంగా ఆస్కార్ నామినేషన్ లో నిలబడి గట్టి పోటీ ఇస్తుంది. ఈ సందర్భంగా ఆర్​ఆర్​ఆర్​ ఆస్కార్​ ప్రమోషన్స్​లో భాగంగా చిత్రబృందం అమెరికాలో పర్యటిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ అక్కడ మీడియాతో ఇంటర్వ్యూల్లో పాల్గొని తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ అట్ ది ఆస్కార్ అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రెడ్ కార్పెట్ పై నడపడం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఎన్టీఆర్​ మాట్లాడుతూ..తమకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఇలా ఆస్కార్ వేడుక రోజు తాము కొమరం భీం పాత్రలో రెడ్ కార్పెట్ పై నటుడిగా నడవనని, యావత్ భారతదేశాన్ని తన గుండెల్లో పెట్టుకొని రెడ్ కార్పెట్ పై నడుస్తానని అన్నారు. ఇలా ఒక భారతీయుడుగా రెడ్ కార్పెట్ పై నడవడం తనకు చాలా గర్వంగా ఉందంటూ ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్​గా మారాయి. ఎన్టీఆర్ నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ ఆ ఈ పాట షూటింగ్ కోసం తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఆ పాట షూటింగ్ కు వారం రోజులు ముందు నుంచి రిహార్సల్స్ చేశామని, షూటింగ్ మధ్యలో ఉన్న గ్యాప్ లో కూడా రిహార్సిల్స్ చేస్తూ చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇలా ఎంతో కష్టపడిన పాటకు సరైన ప్రతిఫలం దక్కుతుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు. తప్పకుండా ఆర్​ఆర్​ఆర్​ బృందం ఆస్కార్​ చేతపట్టుకునే భారతదేశంలో అడుగుపెడతారని ఆశిస్తున్నారు.
మన దేశం తరపున గుజరాతీ మూవీ ఛెల్లో షో సినిమా ఆస్కార్‌కు నామినేషన్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో 2023 ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంపికైంది. అంతేకాకుండా ఆస్కార్ నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్ కూడా అయింది. మరోపక్క ఆర్ఆర్ఆర్ కూడా తప్పకుండా అకాడమీకి నామినేట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ ఆ చిత్రాన్ని మన దేశం తరఫున ఎంపిక చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ డైరెక్టుగానే నామినేషన్స్‌ కోసం పోటీ పడింది.

ఆర్​ఆర్​ఆర్​లోని‘నాటు నాటు’ పాట ఆస్కార్ షార్ట్ లిస్టులో ఎంపికైంది. ఇటీవలే ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఆలియా భట్​, ఒలీవియా హీరోయిన్లుగా తొలిసారి టాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించగా, అజయ్​ దేవగణ్​, శ్రియా సరన్​ కీలక పాత్రల్లో నటించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్​ వద్ద రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలై మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.