ఇంటర్ విద్యార్థులకు అలర్ట్!
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబధించి హాల్ టికెట్స్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పొందుపరిచారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. హాల్ టికెట్స్ లో తప్పులు ఉంటే.. సరిచూసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్ టికెట్స్ పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ నుండి హాల్ టికెట్లను విడుదల చేసుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరగనున్నాయి.
హాల్ టికెట్లలో వివరాలను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. విద్యార్థి పేరు, ఫోటో, సంతకం, మీడియం, పరీక్షకు హాజరయ్యే సబ్జెక్టులు తదితర అంశాలను చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. వీటిల్లో ఏమైనా తేడాలు ఉంటే.. కళాశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి దృష్టికి తీసుకెళ్లి.. వివరాలను సరి చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాల్సిందిగా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లకు ఆదేశాలు ఇచ్చారు.
ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ‘టెలి-మానస్’ సేవలను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒత్తిడి ఫీల్ అయ్యే విద్యార్థులు టెలీ – మానస్ కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించుకోనున్నట్లు తెలిపింది. విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని వెల్లడించింది. ఈ టెలి మానస్ ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. భయం, ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని, ఇవే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని వివరించింది.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్
మార్చి 15న సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్
మార్చి 17న ఇంగ్లీష్ పేపర్
మార్చి 20న మ్యాథ్స్ పేపర్ 1ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 23న మ్యాథ్స్ పేపర్ 1బీ/జూవాలజీ / హిస్టరీ
మార్చి 25న పిజిక్స్ / ఎకనామిక్స్
మార్చి 28న కెమిస్ట్రీ / కామర్స్
మార్చి 31 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (బైపీసీ స్టూడెంట్స్‌కి)
ఏప్రిల్ 03న మోడ్రన్ ల్యాంగ్వేజ్ / జియోగ్రఫీ
ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి 16 నంచి..
మార్చి 16న సెకండ్ ల్యాంగ్వేజ్
మార్చి 18న ఇంగ్లీష్
మార్చి 21న మ్యాథ్స్ పేపర్ 2ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 24న మ్యాథ్స్ పేపర్ 2బీ/జువాలజీ / హిస్టరీ
మార్చి 27న ఫిజిక్స్ / ఎకనామిక్స్
మార్చి 29న కెమిస్ట్రీ / కామర్స్
ఏప్రిల్ 01న పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2 ) బైపీసీ స్టూడెంట్స్
ఏప్రిల్ 04న మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 / జియోగ్రఫీ