పెళ్లిపై అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్
అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున కొడుకుగా టాలీవుడ్ ఎంట్రీ తేలికగానే అయినా సినిమాలు మాత్రం ఆశించినంతగా ఆడకపోవడంతో అఖిల్ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతూనే ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గా ప్రేక్షకులను మెప్పించిన అఖిల్ త్వరలోనే ఏజెంట్గా పలకరించనున్నారు. తాజాగా అఖిల్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి అఖిల్ ఎప్పుడో వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ నిశ్చితార్థం అయ్యాక కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. అప్పటినుంచి అఖిల్ పెళ్లి ఎప్పుడా? అని ఎదురు చూస్తూనే ఉన్నారు అభిమానులు. అంతేకాదు ఇటీవల క్రికెట్ గ్రౌండ్లో అఖిల్ ని చూసి ఒక హీరోయిన్ పడిపోయిందని త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకుంటారంటూ వార్తలు వినిపించాయి.. అయితే అందులోను నిజం లేకపోయింది. అయితే ఇప్పుడు ఒక సందర్భంలో అఖిల్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేయడం వైరల్ గా మారుతుంది. ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకపోతే అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సొంతం చేసుకోవాల్సి ఉంది ఈ సినిమా కోసం ఏకంగా రూ.80 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీసీఎల్ కోసం అఖిల్ ప్రాక్టీస్ చేస్తుండగా అఖిల్ వెల్లడించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అఖిల్ మాట్లాడుతూ సీసీఎల్ లో నాతో పాటు పాల్గొనే వాళ్లు నాకు స్నేహితులుగా ఉంటారు . స్కూల్లో క్లాసులకు వెళ్లకుండా క్రికెట్ ఆడుతూ చాలా సార్లు దొరికామని.. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమని.. క్రికెట్ ఆడుతూ కిటికీల అద్దాలు పగలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే పెళ్లి చూసుకునే ఆలోచన లేదని.. సింగిల్ గా ఉన్న తనకు ఇప్పట్లో మింగిల్ అయ్యే ఆలోచన లేదని తెలిపారు. తను ప్రేమించేది ఒక స్పోర్ట్స్ ను మాత్రమేనని తెలిపారు. ఇక ఈ వ్యాఖ్యలతో ఈ యంగ్ హీరో ఇప్పుడే కాదు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాడా లేదా? అనుకుంటున్నారు అభిమానులు.