నటుడు అజిత్ ఇంట విషాదం
సినీ నటుడు అజిత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి పి.సుబ్రహ్మణ్యం (84) శుక్రవారం ఉదయం కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో అజిత్ దిగ్భ్రాంతికి గురయ్యారు. నాలుగేళ్ల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి వైద్య బృందం ఆయన పట్ల తీసుకున్న శ్రద్ధకు ధన్యవాదాలు తెలుపుతూ అజిత్ కుటుంబం ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఈ సమయంలో అభిమానులు తమకు ప్రైవసీ ఇవ్వాలని, సంతాపం తెలపాలనుకుంటే మెయిల్ ద్వారా తెలియజేయగలరని పేర్కొన్నారు.